Vastu Tips:బావిని పూడ్చి గది కడితే నష్టాలొస్తాయా.. గోబర్ గ్యాస్ ప్లాంట్ఎటు ఉండాలి.?

Vastu Tips:బావిని పూడ్చి గది కడితే నష్టాలొస్తాయా.. గోబర్ గ్యాస్ ప్లాంట్ఎటు ఉండాలి.?

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. కొంతమంది కట్టిన ఇల్లు కొనుక్కుంటే.. మరికొంతమంది స్థలాన్ని కొని కట్టుకుంటారు.   గోబర్​ గ్యాస్​ ప్లాంట్​ ఇంటికి ఎటువైపు ఉండాలి.   బావి ఉన్న స్థలంలో గది కట్టుకోవచ్చా.. అలా కట్టుకుంటే నష్టాలొస్తాయా..మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న :మా ఇంటి పక్కన పాతబావి ఉంది. దాన్ని చాలా కాలం నుంచి వాడటంలేదు. ఇప్పుడు ఆ బావిని పూడ్చి ఆ ప్రదేశంలో చిన్న గది కట్టుకోవాలనుకుంటున్నాం. అది కరెక్టేనా?

జవాబు: పాతబావులు ఉన్న చోట ఇంటికి సంబంధించి ఎలాంటి నిర్మాణం చేయొద్దు. బావుల్ని పూడ్చిన చోట గార్డెన్ పెంచుకోవచ్చు. ఆ స్థలాన్ని ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చు.  కాని గది నిర్మించకూడదు.

ప్రశ్న: ఇంటికి దక్షిణంవైపు గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. వాస్తు ప్రకారం ఇదిసరైనదేనా?

జవాబు: గోబర్ గ్యాస్ ప్లాంట్ భూమిపైన ఏర్పాటు చేస్తున్నారా లేదా భూమి లోపల ఏర్పాటు చేస్తున్నారా అనేది చూడాలి. భూమిలోపల అయితే దక్షిణంవైపు గుంట ఉండకూడదు. అందువల్ల దక్షిణ దిక్కు కాకుండా వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు.